సివిల్ సర్వీసెస్-2015 ఫలితాలు విడుదల.. ఢిల్లీకి చెందిన టినా దాబీకి మొదటి ర్యాంకు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2015 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబరులో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన టినా దాబీ మొదటి ర్యాంకు సాధించారు. రెండవ ర్యాంకు అతర్ ఆమిర్ ఎల్ షఫీ ఖాన్ అనే విద్యార్థి సొంతమైంది. ఆ తరువాతి స్థానాల్లో జస్మీత్ సింగ్ సాంధు, ఆర్తికా శుక్తా, శశాంక్ త్రిపాఠి ఉన్నారు. మొత్తం 1078మంది అభ్యర్థులు బాధ్యతల స్వీకరణకు త్వరలో అపాయింట్ మెంట్ అందుకోనున్నారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా సివిల్ సర్వీసెస్-2015లో మెరుగైన ప్రతిభను కనబర్చారు. విశాఖకు చెందిన చేకూరి కీర్తికి 14వ ర్యాంకు లభించింది. హైదరాబాద్కు చెందిన విద్యాసాగర్నాయుడికి 101వ ర్యాంకు, జొన్నలగడ్డ స్నేహజకు 103వ ర్యాంకు సొంతమైంది. ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.