నరేంద్ర మోదీ బీఏ, ఎంఏ డిగ్రీలను మీడియా ముందుంచిన అమిత్ షా, అరుణ్ జైట్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరేంద్ర మోదీ బీఏ, ఎంఏ డిగ్రీలను మీడియా ముందుంచిన అమిత్ షా, అరుణ్ జైట్లీ

ప్రధాని నరేంద్ర మోదీ బీఏ, ఆపై ఎంఏ విద్యలను అభ్యసించారనడానికి సాక్ష్యాలను చూపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు, తప్పుడు ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికార కార్యాలయంలో మోదీ విద్యార్హతల సర్టిఫికెట్లను ప్రదర్శించిన అమిత్ షా "దేశ ప్రధాని విద్యార్హతలను మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాల్సి రావడం దురదృష్టకరం. డీయూ నుంచి తీసుకున్న బీఏ డిగ్రీని, గుజరాత్ యూనివర్శిటీ నుంచి తీసుకున్న ఎంఏ డిగ్రీని బహిర్గతం చేస్తున్నాం. వీటిని వెబ్ సైట్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచం ముందు ఇండియాపై బురదజల్లే పాపాన్ని ఆయన చేశారు. ప్రధాని డిగ్రీలు నకిలీవని ప్రచారం చేసిన ఆయన క్షమాపణలు చెప్పాలి" అని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు తప్పుడు విద్యార్హతలు చూపితే, వారిపై చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్లీ హెచ్చరించారు.

More Telugu News