వేదికపై శ్రీశ్రీ రవిశంకర్ తన్మయత్వం!... బాలీవుడ్ సాంగ్ కు స్టెప్పులేసిన వైనం!
ఇటీవలే ‘వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్’ పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన మరోమారు వార్తల్లోకెక్కారు. మొన్న ఘనత సాధించి మీడియాకెక్కిన ఆయన... తాజాగా వివాదంలో చిక్కుకుని వార్తల్లోకెక్కారు. అసలు విషయమేంటంటే... తన బోధనలు వినేందుకు వచ్చిన వేలాది మంది భక్తుల ముందు రవిశంకర్ బాలీవుడ్ సాంగును ప్లే చేశారు. అంతేకాదండోయ్... సదరు సాంగుకు వేదికపై తన్మయత్వం చెందిన ఆయన మూగ సైగలు చేస్తూ చిన్న చిన్న స్టెప్పులేశారు. నేషనల్ మీడియాకు చిక్కిన ఈ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.