రూ.19 కోట్లతో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తాం: ఏపీ మంత్రి శిద్దా
ప్రకాశం జిల్లా దర్శిలో నూతన డ్రైవింగ్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ.19 కోట్లతో దర్శి పట్టణంలో నూతన డ్రైవింగ్ స్కూల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల 10న రోడ్డు భద్రతపై సమావేశం జరగనుందని, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రవాణా శాఖాధికారులు అవినీతికి పాల్పడితే కనుక కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా శిద్దా హెచ్చరించారు.