అధ్యక్షపీఠం అంటే రియాలిటీ షో అనుకుంటున్నావా?: ట్రంప్ పై విరుచుకుపడ్డ ఒబామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అధ్యక్షపీఠం అంటే రియాలిటీ షో అనుకుంటున్నావా?: ట్రంప్ పై విరుచుకుపడ్డ ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, వైట్ హౌస్ లో అడుగుపెట్టడం అంటే రియాలిటీషోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని నిలదీశారు. అధ్యక్ష పదవి అంటే వినోదమని ట్రంప్ భావిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ముస్లింలను దేశంలోకి అనుమతించనంటూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హుడా? అని ఆయన ప్రశ్నించారు. విదేశాంగ విధానం విషయంలో కూడా ట్రంప్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అమెరికా ప్రమాణాలు, వాస్తవిక ధోరణితో అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ఇవి అభ్యర్థులందరికీ వర్తిస్తాయని ఆయన సూచించారు. ఉన్నత పదవిని సీరియస్ గా తీసుకునే వ్యక్తినే అది వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తాము ఎవరిని అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోబోతున్నామో తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలనుకునేవారు ట్రంప్ అమెరికాను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు.

More Telugu News