Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి అలజడి.. అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి, పరారీ

చిత్తూరు జిల్లా శేషాచలం గెందిబండ అటవీ ప్రాంతంలో మరోసారి అలజడి చెలరేగింది. ఈరోజు ఉద‌యం అట‌వీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అట‌వీ సిబ్బంది రాక‌ను గ‌మ‌నించిన ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్లు ఒక్క‌సారిగా వారిపై దాడికి దిగారు. దీంతో అట‌వీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. భ‌య‌ప‌డిపోయిన‌ ఎర్రచందనం కూలీలు దుంగలను అక్క‌డే వ‌దిలి పారిపోయారు. స్మ‌గ్ల‌ర్లు దొంగిలించ‌డానికి చూసిన 21 ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50లక్షలు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

More Telugu News