మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,400, విజయవాడలో రూ.30,120, ప్రొద్దుటూరులో రూ.29,950, చెన్నైలో రూ.30,500, ముంబైలో రూ.30,090గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,790, విజయవాడలో రూ.27,900, ప్రొద్దుటూరులో రూ.27,830, చెన్నైలో రూ.28,530, ముంబైలో రూ.29,940గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,100, విజయవాడలో రూ.41,400, ప్రొద్దుటూరులో రూ.41,200, చెన్నైలో రూ.41,635, ముంబైలో రూ.41,415 వద్ద ముగిసింది.