దంచి కొట్టిన వర్షం... తడిసి ముద్దైన హైదరాబాదు
భాగ్యనగరి హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గడచిన నాలుగైదు రోజులుగా అక్కడక్కడ తేలిక పాటి వర్షం కురుస్తుండగా, నేటి తెల్లవారుజామున నగరవ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షం దాదాపు గంటకు పైగా నగరాన్ని ముంచెత్తింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మెజారిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా నగరంలో వాతావరణం చల్లగా మారిపోయింది.