ముజఫర్ పూర్ లో తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు... ఆరుగురు మృతి
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంటిపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న సంబంధిత శాఖాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనతో బాధిత కుటుంబీకుల బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.