ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువ... కాస్త ఓపిక వుండాలి!: ఎంపీ అవంతి శ్రీనివాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువ... కాస్త ఓపిక వుండాలి!: ఎంపీ అవంతి శ్రీనివాస్

ఏపీ ప్రజలకు తొందరెక్కువ అని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన మర్నాటి నుంచే ప్రత్యేకహోదా ఇవ్వలేదు, రైల్వేజోన్ ఇవ్వలేదనడం సరికాదన్నారు. కేసీఆర్ పోరాటం మొదలుపెట్టగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, అందుకు పదమూడేళ్ల సమయం పట్టిందని అన్నారు. ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువని, కొంచెం ఓపికగా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. హామీలు సాధించుకునేందుకు సహనం కావాలని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏ రాష్ట్రం మీద కక్ష కట్టదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందని ఆయన అన్నారు.

More Telugu News