చేతులు జోడించి వేడుకుంటున్నా, ఏపీకి అన్యాయం చేయద్దు: ఎంపీ గల్లా జయదేవ్
‘చేతులు జోడించి వేడుకుంటున్నా, ఏపీకి అన్యాయం చేయద్దు’ అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేంద్రంపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, ఇచ్చిన వాటినే ప్రత్యేక నిధులంటున్నారన్నారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఉందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఆలస్యంగా న్యాయం జరిగినా.. అన్యాయం జరిగినట్లేనని జయదేవ్ అన్నారు.