: మహేష్ తో 'జన గణ మన' సినిమాను ప్రకటించిన పూరీ జగన్నాథ్
ప్రిన్స్ మహేష్ తో కొత్త చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించాడు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రం పేరు ‘జన గణ మన’ అని పూరీ పేర్కొన్నాడు. పూరీ జగన్నాథ్, మహేష్ ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘పోకిరి’ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ కొత్త చిత్రం ప్రకటన చేశాడు. కాగా, 'పోకిరి', 'బిజినెస్ మ్యాన్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం ‘జన గణ మన’.