: ఇంజనీరింగ్ విద్యలో విజేతగా నిలవలేనని ఆ చదువును వదిలేశాను: అనంత శ్రీరామ్
ఇంజనీరింగ్ విద్యలో విజేతగా నిలవలేనని అనిపించడంతో ఆ చదువును వదిలేశానని... తనకు ఇష్టమైన ఈ రంగంలోకి వచ్చానని ప్రముఖ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచే తనకు పాటలు రాసే అలవాటు ఉందన్నారు. ఈ విషయంలో తన తండ్రి తనను బాగా ప్రోత్సహించారన్నారు. ఇంటర్ మీడియట్ చదువుకి వచ్చాక ఒక సినిమా పాట రాయగలిగే స్థాయికి ఎదిగానన్నారు.