ఒలింపిక్స్ పతకం సాధించెయ్!... జిమ్నాస్ట్ దీపాకు వైఎస్ జగన్ గ్రీటింగ్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒలింపిక్స్ పతకం సాధించెయ్!... జిమ్నాస్ట్ దీపాకు వైఎస్ జగన్ గ్రీటింగ్స్

ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీపా పర్మాకర్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది రియోలో జరగనున్న ఒలింపిక్స్ కు దీపా నిన్న అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్ గా రికార్డుకెక్కిన దీపా.. ఆ క్రీడల్లో పతకంతో తిరిగి రావాలని జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన తన ట్విట్టర్ వేదికగా దీపాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

More Telugu News