Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ ఫ్యాన్స్ కన్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ మేలు: వర్మ

వివాదాస్పద ట్వీట్లతో నిత్యమూ సామాజిక మాధ్యమాల్లో ఉండే రాంగోపాల్ వర్మపై సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు విరుచుకుపడుతున్న వేళ, ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్లను వారంతా అపార్థం చేసుకున్నారని, దీన్ని చూస్తుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా, రజనీ సార్ ఫ్యాన్స్ మరింత మూగవాళ్లలా కనిపిస్తోందని అన్నారు. రజనీ కేవలం భువిపై ఉన్న తార కాదని, వినీలాకాశంలోనే ధ్రువతార వంటివాడని వ్యాఖ్యానించారు. తన హిట్ సినిమాల కన్నా, రజనీ ఫ్లాప్ సినిమాలనే అత్యధికంగా చూసినట్టు చెప్పుకొచ్చాడు. అంతకుముందు రజనీ మేకప్ లేకుండా ఉన్న చిత్రాన్ని పోస్టు చేస్తూ, ఆయన అందంగా ఉండరు, 6 ప్యాక్ శరీరం లేదు. కేవలం రెండున్నర డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమే తెలుసు. ఇలా కనిపిస్తూ కూడా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు ప్రపంచంలో మరెవరూ లేరు. ఆయన్ను ఎందుకు ఇష్టపడతారో ఎవరూ చెప్పలేరని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇక, తనపై తిట్ల దండకం మొదలుపెట్టిన రజనీ అభిమానులను, పవన్ కల్యాణ్ అభిమానులతో పోల్చడం ఇంకెన్ని విమర్శలను తెస్తుందో?!

More Telugu News