Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుల్తాన్ షూటింగ్ స్పాట్ లో కుప్పకూలిన బాలీవుడ్ హీరో

సల్మాన్ ఖాన్ మల్లయోధుడిగా నటిస్తున్న 'సుల్తాన్' సినిమా షూటింగ్ స్పాట్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా కుప్పకూలిపోయాడు. సినిమాలను అత్యంత నిబద్ధతతో పూర్తి చేసే రణదీప్ హుడా షూటింగ్ లో ఉండగా తీవ్రమైన కడుపునొప్పితో మెలితిరిగిపోయాడు. షూటింగ్ కు నష్టం కలగకూడదని భావించి, తన పార్ట్ పూర్తయ్యే వరకు పంటి బిగువున బాధను భరించాడు. అనంతరం బాధ భరించలేక కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని హుటాహుటీన ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్ అని తేల్చారు. వెంటనే అతనికి ఆపరేషన్ చేయాలని సూచించారు. రణదీప్ హుడా తాజాగా 'సరబ్ జీత్' సినిమాలో టైటిల్ రోల్ కోసం భారీ ఎత్తున బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తరువాత 'సుల్తాన్'లో పాత్ర కోసం మళ్లీ మామూలు స్థితికి మారాడు. ఇంత పెద్ద స్థాయిలో శారీరక ప్రయోగాలు చేయడంతో అపెండిసైటిస్ బారినపడ్డట్టు తెలుస్తోంది.

More Telugu News