టీడీపీలోకి బొబ్బిలి రాజుల చేరిక 20ననే!... అధికారికంగా ప్రకటించిన టీడీపీ విజయనగరం జిల్లా చీఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీలోకి బొబ్బిలి రాజుల చేరిక 20ననే!... అధికారికంగా ప్రకటించిన టీడీపీ విజయనగరం జిల్లా చీఫ్

వైసీపీ సీనియర్ నేత, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు, వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు బేబి నాయన... ఈ నెల 20న టీడీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీశ్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బొబ్బిలి రాజులు టీడీపీలో చేరిక ఖాయమైపోయిందని ప్రకటించారు. ఇప్పటికే పలు దఫాలుగా బొబ్బిలి రాజుల చేరికకు సంబంధించి ముహూర్తాలు మారిన నేపథ్యంలోనే ద్వారపురెడ్డి ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

More Telugu News