Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... 2.2 లక్షల కేంద్ర ఉద్యోగాల భర్తీకి మోదీ పచ్చజెండా!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఓ శుభవార్త. వచ్చే రెండేళ్లలో 2.2 లక్షల కేంద్ర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నరేంద్ర మోదీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్న మోదీ, ఈ మేరకు నియామకాలకు పచ్చజెండా ఊపినట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మార్చి 1, 2015 నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 33.05 లక్షలు కాగా, 2016లో ఈ సంఖ్యను 34.93 లక్షలకు, ఆపై 2017 నాటికి 35.23 లక్షలకు చేర్చనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిల్లో అత్యధికంగా 70 వేల ఉద్యోగాలు రెవెన్యూ శాఖకు అనుబంధంగా ఉన్న ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాల్లో ఉంటాయని తెలుస్తోంది. కొత్త ఉద్యోగాల భర్తీ జరిగితే నిరుద్యోగులకు 'అచ్చే దిన్' వచ్చినట్టే.

More Telugu News