: ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్


ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ వ్యవహరించనున్నాడు. జహీర్ ఖాన్ ను కెప్టెన్ గా నియమిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ జట్టు సలహాదారు రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, క్రికెట్ లో జహీర్ ఖాన్ తానేంటో నిరూపించుకున్న ఆటగాడని అన్నాడు. అలాగే జహీర్ లో నాయకత్వ లక్షణాలకు కొదువలేదని తెలిపాడు. జహీర్ నాయకత్వంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రాణిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, గాయాలబారినపడి టీమిండియాలో చోటుదక్కించుకోలేక జహీర్ ఖాన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News