Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్లో 24 గంటల్లో నాలుగు లక్షల ఫాలోయర్స్..!

ఓ వ్యక్తి ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఖాతా తెరిచాడో లేదో.. 24 గంటల్లో ఆ వ్యక్తిని 4 లక్షల మంది అనుసరించారు! ఆ వ్యక్తి బిల్ క్లింటన్. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు. అమెరికాకు అధ్యక్షులుగా వ్యవహరించిన అనేకమంది కన్నా క్లింటన్ తన పదవీ కాలంలో మెరుగైన సంస్కరణలతో ప్రజానీకం మనసు చూరగొన్నాడు. అంతేగాకుండా, ప్రపంచ రాజకీయ యవనికపై తనదైన ముద్రవేశాడు.

ఇలాంటి వ్యక్తిని అంతమంది అనుసరించడంలో ఆశ్చర్యమేముంది? అయితే, తనను లక్షలాది మంది ఫాలో అవుతున్నా.. క్లింటన్ మాత్రం ట్విట్టర్లో కేవలం ఎనిమిది మందిని మాత్రమే అనుసరిస్తున్నాడట. ఆ ఎనిమిదిమంది కూడా క్లింటన్ ఫౌండేషన్ అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులే!

More Telugu News