ప్రత్యర్థి భార్యలపై ట్రంప్, క్రూజ్ అసభ్య వ్యంగ్యాస్త్రాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రత్యర్థి భార్యలపై ట్రంప్, క్రూజ్ అసభ్య వ్యంగ్యాస్త్రాలు!

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరి ఒకరి భార్యలను మరొకరు విమర్శించుకునే స్థాయికి చేరాయి. టెడ్ క్రూజ్ భార్య హైదీ క్రూజ్ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్రంప్, 'స్పిల్ దీ బీన్స్' (అందాలను మరింతగా బయటకు తీయాలి అనే అర్ధం వచ్చేలా) అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ కామెంట్ వైరల్ అవుతుండగానే, దీనికి రీట్వీట్ చేసిన క్రూజ్ తనదైన శైలిలో స్పందిస్తూ, ట్రంప్ భార్య, మోడల్ మెలానియా దాదాపు నగ్నంగా ఉన్న చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచి "నో నీడ్ టు స్పిల్ ది బీన్స్" (అందాలను ఇంకా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు) అని కామెంట్ చేశారు. ఈ రెండు చిత్రాలూ వెయ్యి పదాల విమర్శలకు సమానమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి ప్రచారం వ్యక్తిగత విమర్శలకు దారితీయడం, అందునా భార్యలను భాగం చేస్తూ, ఇలా అసభ్య పదజాలం, ఇబ్బందికర చిత్రాలను ప్రచారానికి వాడటం సరికాదని రాజకీయ పరిశీలకులు సలహా ఇస్తున్నారు.

More Telugu News