Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

103వ అంతస్తులో సినీ నటి రెజీనా పుషప్స్!... ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో!

పదంతస్తుల భవనంలో టాప్ ఫ్లోర్ లో రూఫ్ ఎక్కి చివరికెళ్లి కిందకు చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది 103 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని ఎక్కి ఏకంగా పుషప్స్ తీస్తే... ఊహించడానికే భయంగా అనిపిస్తుంది. అయితే టాలీవుడ్ లో తార స్థాయికి శరవేగంగా దూసుకెళుతున్న హీరోయిన్ రెజీనా... భయానికి భిన్నంగా సదరు సన్నివేశాన్ని ఎంజాయ్ చేసిందట. అంతేకాదు, మీరు కూడా అలా ఆకాశహర్మ్యాలకు వెళితే... ఎంజాయ్ చేయడం మరిచిపోకండి అంటూ అభిమానులకు కూడా చెబుతోంది. అసలు విషయంలోకి వెళితే... రెజీనా ఇటీవల అమెరికాకు వెళ్లిన సందర్భంగా అక్కడి ‘స్కైడెక్ షికాగో’ను సందర్శించింది. అందులో చివరి ఫ్లోర్ కు చేరుకుని కింద ఉన్న భవంతులను చూస్తూ ఎంజాయ్ చేసింది. కాలి కింద ఉన్న అద్దాల్లోంచి కింద కనిపిస్తున్న భవంతులను మరింత దగ్గరగా చూసేందుకంటూ రెజీనా అక్కడే పుషప్స్ మొదలెట్టింది. ఆకాశంలో ఉన్నామన్న ఫీలింగ్, కాళ్ల కింద అద్దాలు, చిన్న గుడిసెల్లా కనిపిస్తున్న భారీ భవంతులను పుషప్స్ చేస్తూనే ఎంజాయ్ చేసిన రెజీనా... అక్కడ ఓ ఫొటో కూడా తీసుకుంది. దానిని తన అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎప్పుడైనా షికాగో వెళితే స్కైడెక్ షికాగోను సందర్శించడం మరవొద్దని, పుషప్స్ తీయడం అంతకన్నా మరిచిపోవద్దని అభిమానులకు సలహా ఇచ్చింది. ఇక ఫొటో తీసుకోవడం మరీ ముఖ్యమంటూ పేర్కొంది.

More Telugu News