ఆడియో వేడుక పాస్ ల కోసం పవన్ కల్యాణ్ అభిమానుల ఆందోళన!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ వేడుకకు తమకు పాసు లివ్వాలంటూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వారు ఈరోజు ఆందోళన చేపట్టారు. తాము లేకుండా ఈ ఆడియో వేడుక ఎలా నిర్వహిస్తారంటూ వారు ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, పొరుగు రాష్ట్రం కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.