Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అబ్బాయి కడుపులో గర్భసంచి!... ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

మీరు చదివింది నిజమే. సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఓ అబ్బాయి కడుపులో గర్భసంచి అభివృద్ధి చెందింది. చిన్నప్పటి నుంచి ఆడ పిల్లల లక్షణాలు కనిపిస్తున్నాయంటూ అతడి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. పురుషుడి కడుపులో కనిపించిన ఆ గర్భసంచిని ఆ తర్వాత ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ అరుదైన ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ముస్తాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపెల్లి గ్రామానికి చెందిన కుర్ర శేఖర్, భారతిల కుమారుడు వేణు (13)లో చిన్నప్పటి నుంచి ఆడపిల్లల లక్షణాలు కనిపించాయి. దీంతో అతడిని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లిన అతడి తల్లిదండ్రులు ఇటీవల ముస్తాబాదులోని పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు జరిపిన వైద్యుడు శంకర్... బాలుడి కడుపులో గర్భసంచిని గుర్తించారు. హిమోప్రోడిజం అనే వ్యాధి వల్ల వేణులో ఆడ, మగ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయని శంకర్ తేల్చారు. ఆ తర్వాత వేణుకు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గర్భసంచిని తొలగించారు.

More Telugu News