Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తున్నారు: సాక్ష్యాలు విడుదల చేసిన సౌత్ కొరియా

సౌత్ జపాన్ తీరంలో మరింతగా ఉద్రిక్తతలను పెంచుతూ, నార్త్ కొరియా సైన్యం ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియో ఫుటేజ్ నీ సౌత్ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఆదేశాల మేరకు వీటి ప్రయోగం జరిగిందని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నేటి తెల్లవారుఝామున 5:55 (స్థానిక సమయం) గంటలకు 800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే క్షిపణులను ఆ దేశం ప్రయోగించిందని తెలిపారు. అయితే, ఇది ఏ తరహా మిసైల్ అన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదని దక్షిణ కొరియా న్యూస్ ఏజన్సీ యోన్హాప్ తెలిపింది. కాగా, ఇది 'రొడాండ్' క్షిపణి కావచ్చని, ఇది 1,300 కిలోమీటర్ల వరకూ న్యూక్లియర్ వార్ హెడ్ లను మోసుకెళ్తుందని తెలుస్తోంది. కాగా, దక్షిణ కొరియా, అమెరికాలు కలిసి సంయుక్త విన్యాసాలు ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

More Telugu News