రాజ్ భవన్ చేరిన పంచాయతీ!... స్పీకర్ పై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పంచాయతీ తాజాగా రాజ్ భవన్ చేరింది. తన సభ్యురాలిపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఎత్తివేసినా... స్పీకర్ మాత్రం ఆమెను సభ లోపలికి అనుమతించడం లేదని వైసీపీ కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ లేకపోవడంతో రాజ్ భవన్ కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు.