Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంచి పీఠాధిపతికి చెన్నై కోర్టు సమన్లు... 28న విచారణకు హాజరుకావాలని తాఖీదు

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి చెన్నై కోర్టు నుంచి నిన్న సమన్లు జారీ అయ్యాయి. ఆడిటర్ రాధాకృష్ణన్ పై జరిగిన దాడి కేసులో జయేంద్ర సహా 9 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం చెన్నై మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలో జరుగుతోంది. ఏప్రిల్ 28న జరగనున్న విచారణకు హాజరుకావాలని జయేంద్రకు నిన్న కోర్టు నోటీసులు జారీ చేసింది. జయేంద్రతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఎనిమిది మందికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

More Telugu News