ఒక బాక్సైట్ కాంట్రాక్టర్ నుంచి జగన్ రూ.50 కోట్లు డిమాండ్ చేశాడు: బొండా ఉమ ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక బాక్సైట్ కాంట్రాక్టర్ నుంచి జగన్ రూ.50 కోట్లు డిమాండ్ చేశాడు: బొండా ఉమ ఆరోపణ

సొంత పత్రిక, ఛానెల్ పెట్టుకున్న వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత అయిన జగన్మోహన్ రెడ్డి తప్పుడు వార్తలు రాయిస్తున్నాడని ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అని కోర్టే చెప్పిందన్నారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న జగన్, ఇటీవల ఒక బాక్సైట్ కాంట్రాక్టర్ ను తన ఇంటికి రప్పించుకుని కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని ఆయన ఆరోపించారు. పెన్నా ప్రతాప్ రెడ్డిని రూ.50 కోట్లు డిమాండ్ చేసిన మాట వాస్తవమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ తమపై కూడా ఆరోపణలు చేస్తున్నారని, ఒక పథకం ప్రకారం ఈ తప్పుడు పనులకు పాల్పడుతున్నారని ఉమ మండిపడ్డారు.

More Telugu News