నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు... ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ మారుతోంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు... ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ మారుతోంది!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యూనిఫాం మారనుంది. మోకాళ్ల వరకూ ఉన్న నిక్కర్ల స్థానంలో నీలం లేదా బూడిద రంగు ప్యాంట్లు రానున్నాయని సమాచారం. నేటి నుంచి రాజస్థాన్ లో మూడు రోజుల పాటు జరగనున్న ఆర్ఎస్ఎస్ సదస్సులో ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. యూనిఫాంను మార్చాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈ అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చారు. కార్యకర్తలతో చర్చించిన మీదట కొత్త యూనిఫాంపై ప్రకటన వెలువడుతుందని ఆర్ఎస్ఎస్ నేతలు ఇప్పటికే వెల్లడించారు. కాగా, దాదాపు 90 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న ఆర్ఎస్ఎస్, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సేవకులను కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది.

More Telugu News