ఆగ్రహించిన రాజధాని రైతులు... జగన్ దిష్టిబొమ్మ దహనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆగ్రహించిన రాజధాని రైతులు... జగన్ దిష్టిబొమ్మ దహనం!

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని భూముల దందాలో టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో రైతులు ఈ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఈరోజు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి మందడం గ్రామం వరకు జగన్ దిష్టిబొమ్మను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడ దహనం చేశారు. అనంతరం మందడం జడ్పీ హైస్కూల్ లో రాజధాని రైతుల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి 29 గ్రామాలకు చెందిన సుమారు 1000 నుంచి 1500 మంది రైతులు హాజరైనట్లు సమాచారం. రైతులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచందర్ రావు, మంగళగిరి మున్సిపల్ చైర్మన్ చిరంజీవిలతో పాటు 29 గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, టీడీపీ నేతలపై దుష్ప్రచారం కారణంగా రాజధాని నిర్మాణానికి ఆటంకం కలగడమే కాకుండా, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News