పీసీబీ సాధించింది...భారత్-పాక్ మ్యాచ్ వేదిక కోల్ కతాకు మారింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీసీబీ సాధించింది...భారత్-పాక్ మ్యాచ్ వేదిక కోల్ కతాకు మారింది

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన మాట నెగ్గించుకుంది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఈ నెల 19న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. స్థానికుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ మ్యాచ్ ను ఇక్కడ నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. తాము భద్రత కల్పించలేమని తెలిపింది. దీంతో పీసీబీ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని పంపింది. ఇది ఇచ్చిన నివేదికను చూసిన పాక్ ప్రధాని మ్యాచ్ వేదిక మార్చాలని ఐసీసీకి లేఖ రాసి, భారత పర్యటనకు పాక్ క్రికెట్ జట్టుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఐసీసీ సూచనతో బీసీసీఐ వేదికను మార్చింది. దీంతో ఈ నెల 19న జరగనున్న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్ కు కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికకానుంది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

More Telugu News