ముద్రగడ వెనుక వైసీపీ నేత కరుణాకరరెడ్డి?... కూపీ లాగుతున్న పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముద్రగడ వెనుక వైసీపీ నేత కరుణాకరరెడ్డి?... కూపీ లాగుతున్న పోలీసులు

కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కీలక భూమిక పోషించారా?... అంటే, అవుననే అంటున్నాయి ఏపీ పోలీసు వర్గాలు. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో ముద్రగడ ఏర్పాటు చేసిన కాపు ఐక్య గర్జనకు లక్షలాదిగా కాపులు తరలివచ్చారు. ఇక రోడ్డుపై తేల్చుకుందామన్న ముద్రగడ ఒక్కమాటతో కాపులంతా పేట్రేగిపోయారు. రోడ్డుపై వెళుతున్న పలు వాహనాలపైనా, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పైనా విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు... అసలు ఈ విధ్వంసం వెనుక సూత్రధారులుగా ఉన్నవారెవరన్న కోణంలో ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డికి సంబంధించిన పాత్రపై పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పక్షం టీడీపీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న క్రమంలో భూమన పాత్రకు సంబంధించి మరింత మేర స్పష్టమైన ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News