ముస్లిం పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాకు చెక్!... గానా బజానా కూడా వద్దంటున్న మత గురువులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లిం పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాకు చెక్!... గానా బజానా కూడా వద్దంటున్న మత గురువులు

ఇస్లామిక్ చట్టాలు దుబారాకు దూరంగా ఉండాలని చెబుతున్నాయి. ఇదే అంశం ఆధారంగా ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ కు చెందిన ఇస్లామిక్ మత గురువులు ఇటీవల పలు కీలక తీర్మానాలు చేశారు. ఇకపై జరిగే ముస్లిం పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలను వాడరాదన్నది అందులో ఓ తీర్మానం. అంతేకాక ఇప్పటిదాకా వారి పెళ్లిళ్లలో వేడుకగా జరుగుతున్న గానా బజానాకు కూడా వీడ్కోలు పలకాల్సిందేనని కూడా వారు చెబుతున్నారు. ఇటీవల సమావేశమైన అక్కడి మతగురువులు పెళ్లిళ్లలో దుబారాకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా అమల్లోకి రాని ఈ తీర్మానాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే... బ్యాండ్ బాజా, గానా బజానాలు లేక చప్పగా సాగనున్న ముస్లిం పెళ్లిళ్లు... దుబారాకు మాత్రం వీడ్కోలు పలికి ఆదర్శ పెళ్లిళ్లుగా చడీ చప్పుడు లేకుండా జరగనున్నాయి.

More Telugu News