కాపు ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాను: ముద్రగడ పద్మనాభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాపు ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాను: ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు ఆంక్షలు పెడుతున్నారని, అనర్హులకు రుణాలు మంజూరు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నందున ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే ఆలోచన లేదని ముద్రగడ పేర్కొన్నారు.

More Telugu News