చెల్లి కనుగుడ్లు పీకేసి, చెవులు కోసేసి...140 సార్లు కత్తితో పొడిచిన అక్క... రష్యాలో ఘోరం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెల్లి కనుగుడ్లు పీకేసి, చెవులు కోసేసి...140 సార్లు కత్తితో పొడిచిన అక్క... రష్యాలో ఘోరం!

రష్యాలో అత్యంత పాశవికమైన హత్య జరిగింది. మోడల్ అయిన చెల్లిని సొంత అక్కే మాదకద్రవ్యాల మత్తులో అత్యంత పాశవికంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో షోమ్యాన్ స్టాస్ బేర్ స్కీ(42) నివాసానికి అతనితో పాటు మోడల్ స్టెఫానియా దుబ్రొవీనా (17), ఆమె సోదరి ఎలిజావెటా దుబ్రొవీనా (19) వెళ్లారు. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి పార్టీ చేసుకున్న వీరు, మాదకద్రవ్యాలు కూడా తీసుకున్నారు. అనంతరం బేర్ స్కీ ఏదో కొనేందుకు బయటకు వెళ్లాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ స్టెఫానియాను, ఎలిజావెటా అత్యంత పాశవికంగా హత్య చేసింది. చెల్లెలి కనుగుడ్లు పీకేసి, చెవులు కోసేసి ఆమె శరీరంపై 140 సార్లు కత్తితో పొడిచి హత్య చేసింది.

More Telugu News