కడప సెంట్రల్ జైల్లో కలకలం... జైల్లో ఉరేసుకుని జీవిత ఖైదీ ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప సెంట్రల్ జైల్లో కలకలం... జైల్లో ఉరేసుకుని జీవిత ఖైదీ ఆత్మహత్య

కడప సెంట్రల్ జైల్లో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. ఓ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న కుమార్ అనే ఖైదీ జైలు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. నేటి ఉదయం జైలులోని బ్రిక్స్ ఫ్యాక్టరీలో కుమార్ ఉరి వేసుకున్నాడు. ఈ క్రమంలో జైలు అధికారులు గుర్తించేలోగానే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెనువెంటనే జైలు అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేదాకా ప్రాణాలతోనే ఉన్న కుమార్ చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. జీవిత ఖైదీ ఉరేసుకోవడంతో అక్కడ కలకలం రేగింది.

More Telugu News