పాక్ జట్టులో నాకు అవకాశమివ్వండి.. భారత బౌలర్ల పనిపడతా: పాక్ వీరాభిమాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ జట్టులో నాకు అవకాశమివ్వండి.. భారత బౌలర్ల పనిపడతా: పాక్ వీరాభిమాని!

దాయదుల పోరు కేవలం భారత్, పాకిస్థాన్ దేశాలకే కాదు యావత్ క్రికెట్ ప్రపంచానికి ఆసక్తిదాయకమే. ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లలో పాక్ ఓటమి పాలైన సందర్భాల్లో ఆ దేశంలో పాకిస్థాన్ క్రీడాకారుల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. అయితే, రెండు రోజుల క్రితం జరిగిన భారత్-పాక్ టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి పాలవడంపై దుబాయికి చెందిన పాక్ వీరాభిమాని ఒకరు తీవ్రంగా స్పందించాడు. ‘భారత్ పై ఆడేందుకు నాకు అవకాశమిస్తే, హెల్మెట్ ధరించకుండా ఆ బౌలర్లను ఎదుర్కొంటాను.. చితక్కొడతాను’ అని ఆ వీరాభిమాని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. భారత్ బౌలర్లను ఏ విధంగా ఎదుర్కొనాలో పాక్ క్రీడాకారులకు తెలియడం లేదని, కనీసం తనకైనా అవకాశం కల్పించాలంటూ పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ లకు ఆ వీరాభిమాని విజ్ఞప్తి చేశాడు.

More Telugu News