క్రీడా శాఖకు కేటాయింపుల్లో పెరుగుదల స్వల్పమే!
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాధారణ బడ్జెట్ లో క్రీడా శాఖకు కేటాయింపులు స్వల్పమనే చెప్పవచ్చు. క్రీడాశాఖకు కేటాయింపుల్లో రూ.51 కోట్ల పెరుగుదల కనిపించింది. ఈ బడ్జెట్ లో క్రీడా శాఖకు రూ.1592 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.1400 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.192 కోట్లు. అదే, గత ఏడాది బడ్జెట్ లో ఈ శాఖకు రూ.1541 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాది కన్నాఈ ఏడాది ప్రణాళిక వ్యయం కేటాయింపుల్లో రూ.10.81 కోట్లు పెరుగుదల కనిపించగా, ప్రణాళికేతర కేటాయింపులు రూ.40.15 కోట్లకు పెరిగింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి ప్రత్యేక పథకం కింద రూ.144.98 కోట్లు, జాతీయ స్పోర్ట్స్ క్యాంపుల కోసం రూ. 381.30 కోట్లు, క్రీడా సంస్థల కోసం రూ.545.90 కోట్లు, యువత, జాతీయ సేవా పథకంకు రూ.215.70 కోట్లు కేటాయించారు.