Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిలీనియంలో అతిపెద్ద స్కామ్ 'ఫ్రీడమ్ 251': కాంగ్రెస్ ఆరోపణ

కేవలం రూ. 251కే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ ముందుకు రావడం ఈ మిలీనియంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ స్కామ్ లో బీజేపీ ప్రభుత్వం సహకరించిందని ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ విరుచుకుపడ్డారు. ఈ ఫోన్ ఆవిష్కరణలో బీజేపీ నేతలు పాల్గొనడంపై పార్లమెంటులో సమాధానాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. "ఈ ప్రభుత్వం ఓ పెద్ద కుంభకోణంలో భాగమైంది. బీజేపీ పాలనలో ఇది ఓ అతిపెద్ద స్కాం. ఈ ప్రొడక్టును బీజేపీ నేతలే ఆవిష్కరించారు. రింగింగ్ బెల్స్ వెనుక బీజేపీ నేతలున్నారు. మేకిన్ ఇండియా అంటూ ప్రచారం చేస్తున్న వేళ ఈ ఉదంతం 'మేకిన్ ఫ్రాడ్'గా మారింది. అసలు ఇంత తక్కువ ధరకు ఫోన్ ఎలా ఇస్తారని అనుకున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం ఉదంతంలో ప్రజలను తీవ్రంగా మోసం చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును సురక్షితం చేయాలని ఈ ఫోన్ ధర కనీసం రూ. 1,400 ఉండాలని ఆయన అన్నారు.

More Telugu News