మిస్టర్ క్రిస్ గేల్... మీరు నన్ను గుర్తుపట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు: అమితాబ్ బచ్చన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్టర్ క్రిస్ గేల్... మీరు నన్ను గుర్తుపట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు: అమితాబ్ బచ్చన్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు ఊహించని విధంగా ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ నుంచి ఒక కానుక లభించింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ ఆ కానుకను బిగ్ బీకి పంపించాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. క్రిస్ గేల్ సంతకం చేసిన ఒక బ్యాట్ ను తనకు కానుకగా ఇచ్చాడని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. ‘మిస్టర్ క్రిస్ గేల్... నన్ను మీరు గుర్తుపట్టగలరని నేనెప్పుడూ అనుకోలేదు...ఎంత వినయం! మీరు చూపించిన గౌరవానికి సంతోషం. మేమందరం మీ అభిమానులం. మీ సంతకంతో ఇచ్చిన ఈ కానుక చాలా దివ్యమైంది’ అని అమితాబ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, క్రిస్ గేల్ ట్వీట్ తో పాటు, ఆ బ్యాట్ తో అమితాబ్ ఉన్న ఫొటోను బిగ్ బీ పోస్ట్ చేశారు. ‘నా స్పార్టన్ బ్యాట్ ను లెజెండ్ కు కానుకగా ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అమితాబ్ చిత్రాలు, ఆయన స్టైల్ ను బాగా అభిమానిస్తాను’ అని క్రిస్ గేల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News