1600 మెగావాట్ల జెన్ కో ప్రాజెక్టులు జాతికి అంకితం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని నేలటూరులో నిర్మించిన 1600 మెగావాట్ల జెన్ కో ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ మేరకు సీఎం ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టును గాయత్రి సంస్థ, సింగపూర్ కు చెందిన సెమ్ కార్ప్ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి. అంతేగాక రెండో దశలో నిర్మించబోయే 800 మెగావాట్ల మూడో యూనిట్ కు సీఎం ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఏపీ జెన్ కో పరిపాలన భవనాన్ని సీఎం, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.