స్మృతి ఇరానీకి ప్రధాని ప్రశంసలు... 'సత్యమేవ జయతే‘ అంటూ ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్మృతి ఇరానీకి ప్రధాని ప్రశంసలు... 'సత్యమేవ జయతే‘ అంటూ ట్వీట్

లోక్ సభలో సుమారు 40 నిమిషాలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసి, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న రాజకీయ పార్టీల, నాయకుల రెండు నాల్కల వ్యవహారాన్ని అపరకాళిలా చీల్చి చెండాడిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మ్రతి ఇరానీ ప్రసంగానికి ప్రధాని మోదీ కూడా ముగ్ధులైనట్టున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై దేశ ద్రోహం కేసుల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న విషయం తెలిసిందే. దీనిపై బుధవారం లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి స్మ్రతి ఇరానీ ప్రతి ఒక్కరి ఆరోపణలకు సమాధానమిస్తూ... ప్రతిపక్షాలకు రాజకీయ స్వప్రయోజనాలే తప్ప దేశహితం పట్టదంటూ ఆమె ఏకి పారేశారు. తన మంత్రివర్గ సహచరురాలి ప్రసంగం పట్ల ప్రధాని మోదీ కూడా సంతుష్టులైనట్టున్నారు. అన్ని అంశాలపై ట్విట్టర్ వేదికగా స్పందించే ప్రధాని... స్మృతి ఇరానీ ప్రసంగంపై కూడా ట్వీట్ చేశారు. ఆమె ప్రసంగంతో కూడిన యూట్యూబ్ లింక్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ’స్మృతి ఇరానీ ప్రసంగాన్ని వినండి, సత్యమేవ జయతే‘ అని ట్వీట్ చేశారు.

More Telugu News