రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు-2
2016-17 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన ప్రతిపాదనల్లోని మరిన్ని ముఖ్యాంశాలు...
* జపాన్ సాయంతో ఢిల్లీ, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే లైన్
* శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ లకే పరిమితమైన 'రైల్ బంధు' పత్రిక ఇక అన్ని రైళ్లలో అందుబాటులోకి.
* అన్ని రీజనల్ భాషల్లో ముద్రితం కానున్న రైల్ బంధు పత్రిక.
* అన్ని తత్కాల్ కౌంటర్లలో సీసీ కెమెరాలతో నిఘా.
* బ్రోకర్లకు అడ్డుకట్ట వేసి తీరుతాం.
* ప్రయాణికులు ఎస్ఎంఎస్ చేస్తే, పక్క స్టేషన్లలోనే బోగీలు, మరుగుదొడ్ల శుభ్రత.
* ఐఆర్సీటీసీ ద్వారా మరిన్ని స్టేషన్లలో ఆహార సరఫరా ఏర్పాట్లు.
* పాలు, అత్యవసర ఔషధాలు సైతం అందుబాటులోకి.
* బుకింగ్ సమయంలోనే ప్రయాణ బీమా సౌకర్యం.
* స్టేషన్లలో పిల్లల కోసం బేబీ ఫుడ్, వేడి పాలు, నీళ్ల సౌకర్యం.
* తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు.
* ఆధ్యాత్మిక కేంద్రాల్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కొత్త పథకం.
* తొలి దశలోనే తిరుపతి రైల్వే స్టేషన్ కు అవకాశం.
* ఎంపిక చేసిన రైళ్లలో స్మార్ట్ రైల్వే కోచ్ లు.
* రాజధాని, శతాబ్ది సహా అన్ని మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల వినోదం కోసం ఎఫ్ఎం రేడియో సేవలు.
* ఢిల్లీ ప్రభుత్వ సహకారంతో కాలుష్య రహిత రైల్వే మార్గాల అభివృద్ధి
* 130 కి.మీ వేగంతో ప్రయాణించే తేజాక్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభిస్తాం.
* 408 స్టేషన్లకు విస్తరించనున్న ఈ-క్యాటరింగ్ సేవలు.
* టికెట్ రిజర్వేషన్లలో 33 శాతం మహిళలకు కేటాయింపు.
* 2 వేల స్టేషన్లలో 20 స్క్రీన్లపై ప్రయాణికుల వివరాల డిస్ ప్లే.
* 2016-17 ఆదాయ లక్ష్యం రూ. 1.84 లక్షల కోట్లు.
* ప్రణాళికా వ్యయం రూ. 1.21 లక్షల కోట్లు.
* పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ వచ్చే మూడేళ్లలో పూర్తి.
* ప్యాసింజర్ రైళ్ల వేగం 60 కిలోమీటర్లకు, ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం 80 కిలోమీటర్లకు పెంచుతాం.
* వెయ్యి రైళ్లలో బయో టాయ్ లెట్ల ఏర్పాటు.
* 1350 క్రాసింగ్ ల వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ లకు ప్రతిపాదనలు.
* నాగపూర్ - విజయవాడల మధ్య వాణిజ్య కారిడార్.
* ప్రధాన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా ఆస్థా రైళ్లు.
* చెన్నై కేంద్రంగా మొట్టమొదటి భారతీయ రైల్వే ఆటో హబ్.
* వికలాంగుల కోసం రైళ్లలో ప్రత్యేక టాయ్ లెట్లు.
* 2017లో 2,800 కి.మీ మేర కొత్త రైల్వే మార్గాల నిర్మాణం.
* ఖరగ్ పూర్ నుంచి విజయవాడ మధ్య మూడవ లైన్.
* జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న పలు టన్నెల్ ప్రాజెక్టులు వేగవంతం.
* 9 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించడం రైల్వే లక్ష్యం.
* దీర్ఘకాల కోరికలన్నీ 2020 నాటికి సాకారం చేసేలా ప్రణాళికలు.
* కాపలా రహిత క్రాసింగ్ లన్నీ తొలగించేందుకు చర్యలు.