రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
2016-17 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు...
* రూ. 1.21 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్.
* ఇది నా బడ్జెట్ కాదు. దేశ ప్రజలందరిదీ.
* సామాన్యుల ఆశలను తీర్చేలా ప్రతిపాదనలు ఉంటాయి.
* రాబడిని పెంచుకునేందుకు కొత్త ఆలోచనలు.
* సంప్రదాయాలు వీడి వినూత్నత వైపు అడుగులు వేయాల్సిన సమయం.
* వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోబోము.
* ఇంధన సేకరణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకున్నాం.
* ఇది సవాళ్లతో కూడుకున్న సమయం.
* ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి.
* చార్జీలు పెంచితేనే ఆదాయం వస్తుందన్న ఆలోచన లేదు.
* ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాం.
* భారీగా ఆదా చేయడమే ఈ ఏటి లక్ష్యం.
* భారతీయులంతా గర్వపడేలా రైల్వే వ్యవస్థ.
* సేవల నుంచి సౌకర్యాల వరకూ మెరుగుపడాల్సి వుంది.
* భద్రతా ప్రమాణాల కోసం అధునాతన సాంకేతికత.
* 2008 నుంచి 2014 వరకూ 8 శాతం వృద్ధిలోనే రైల్వేలు.
* గత సంవత్సరం ప్రతిపాదనల్లో 139 అంశాల్లో ముందడుగు.
* వచ్చే ఐదేళ్లలో రూ. 1.50 లక్షల కోట్లు వెచ్చించేందుకు ఎల్ఐసీ అంగీకారం.
* గత ఆరేళ్లలో సగటున రోజుకు 4.3 కి.మీ రైల్వే లైన్ల నిర్మాణం.
* ప్రస్తుతం రోజుకు 7 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను నిర్మిస్తున్నాం.
* ఒక్క రూపాయి ఖర్చుతో ఐదు రూపాయల వృద్ధి నమోదయ్యేలా పనులు.
* 2017-18లో రైల్వేల నుంచి 9 వేల ఉద్యోగాలు రానున్నాయి.
* వచ్చే ఏడాది 2 వేల కిలోమీటర్ల మార్గాల విద్యుదీకరణ.
* ఢిల్లీ - చెన్నై, ఖరగ్ పూర్ - ముంబై, ఖరగ్ పూర్ - విజయవాడ మధ్య సరకు రవాణా మార్గాలు.
* 1,517 కి.మీ మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో కనెక్టివిటీ.
* బ్రాడ్ గేజ్ గా మారనున్న మిజోరం - మణిపూర్ లైన్.
* మేకిన్ ఇండియాలో భాగంగా రెండు కొత్త లోకో ప్రాజెక్టులు.
* అన్ని విభాగాల్లో కాగిత రహిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ దిశగా అడుగులు.
* ఈ సంవత్సరం 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు.
* వచ్చే రెండు సంవత్సరాల్లో 400 స్టేషన్లకు విస్తరణ.
* యువత, ఔత్సాహికులకు సౌలభ్యం కోసమే వైఫై.
* 5,300కి.మీ పొడవైన 44 కొత్త లైన్లకు ఎంఓయూలు
* అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ బలోపేతంతో లీకేజీలకు అడ్డుకట్ట.
* మహిళల కోసం 24/7 పనిచేసే ప్రత్యేక విభాగం.
* 311 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు.
* రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు.
* వ్యయ భారాన్ని పంచుకునే రాష్ట్రాలకు పెద్దపీట.
* ప్రయాణికుల నుంచి సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్ఎస్ నంబర్ ఏర్పాటు చేస్తాం.
* సాధారణ ప్రయాణికులు, రైల్వేలకు మధ్య అడ్డుగోడలిక ఉండవు.
* ఎంపిక చేసిన స్టేషన్లలో డిస్పోజబుల్ బెడ్ షీట్లు.
* కొత్తగా 74 రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సేవలు.
* 2015-16లో ఇంధన ఆదాతో రూ. 8,720 కోట్ల లాభం.
* సామాన్యుల కోసం పూర్తి అన్ రిజర్వుడు బోగీలతో అంత్యోదయా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు.
* దీన్ దయాళు కోచ్ ల పేరిట అన్ని రైళ్లలో సామాన్యుల కోసం అదనపు బోగీలు.
* ఈ బోగీలో మంచినీరు, చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు.
* ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్ బెర్తుల కేటాయింపు.
* పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునికీకరణ.
* ప్రాజెక్టు ప్రారంభానికి పట్టే సమయం రెండేళ్ల నుంచి 8 నెలలకు తగ్గించిన ఘనత మోదీ సర్కారుదే.
* వచ్చే ఐదేళ్లలో రూ. 8.50 లక్షల కోట్లతో రైల్వేల ఆధునికీకరణ.
* పారదర్శకతను పెంచేందుకు సోషల్ మీడియా వినియోగం.
* ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం.
* బిజీ రూట్లలో ఉదయ్ ఎక్స్ ప్రెస్ పేరిట ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ రైళ్లు.
* 2014తో పోల్చితే 20 శాతం తగ్గిన రైలు ప్రమాదాలు.
* విద్యుత్ సేకరణలో పోటీ విధానం తరువాత గణనీయమైన ఆదా.
* 1,780 ఆటోమేటిక్ టికెట్ విక్రయ కేంద్రాల ఏర్పాటు.
* వీటిద్వారా నిమిషానికి 2 వేల నుంచి 7,200 టికెట్ల విక్రయాలు.
* పూర్తి స్థాయి రైల్వే విశ్వవిద్యాలయంగా వడోదరలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైల్వే.
* ఇకపై ప్రతి ప్రయాణికుడి నుంచి ఫీడ్ బ్యాక్ పొందేలా చర్యలు
* ప్రతి రైల్వే ప్రయాణికుడూ బ్రాండ్ అంబాసిడరే.
* డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ ఫాం టికెట్లు కొనే అవకాశం.
* పాత్రికేయులకు రాయితీ పాస్ ల ద్వారా ఆన్ లైన్ బుకింగ్ నకు అవకాశం.