ఏపీ డీహెచ్ 9999 నెంబర్ కు అత్యధిక ధర
ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్సీ నంబర్లు క్రేజీ ధరను సొంతం చేసుకున్నాయి. ఏపీ16 డీహెచ్ నుంచి 9999 నంబర్ల వరకు నిర్వహించిన వేలంలో పలువురు పోటీపడ్డారు. ముఖ్యంగా 9999 నంబరు కాసుల వర్షం కురిపించింది. దాని కోసం ముగ్గురు పోటీపడ్డారు. వారిలో సూపర్ విజ్ ప్రొఫెషనల్స్ లిమిటెడ్ యజమాని గుప్తా, మరో ఇద్దరు ఈ నంబరు కోసం బిడ్లు వేశారు. వారిలో సూపర్ విజ్ వేసిన బిడ్ రూ.6.03 లక్షలు ఉండటంతో వారికే రవాణాశాఖ వారు కేటాయించారు. అయితే విజయవాడ నగరంలోని ఆర్టీఏ చరిత్రలో ఇదే అత్యధిక ధరని, ఇంతవరకు ఇంత మొత్తం చెల్లించి ఎవరూ ఫ్యాన్సీ నంబరును దక్కించుకోలేదని చెబుతున్నారు.