తెలంగాణలో 8.. ఆంధ్రలో 8 జిల్లాలలో నక్సల్స్ ప్రభావం
దేశవ్యాప్తంగా 106 జిల్లాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కేంద్ర హోంశాఖ బుధవారం రాత్రి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది, తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ నక్సల్స్ ప్రాబల్యం ఉన్నట్టు గుర్తించింది. ఇక ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో చేరాయి. దీంతో ఈ జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతకు, రహదారులు, అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు విడుదల కానున్నాయి.