సంజయ్ దత్ విడుదలపై ప్రజాహిత వ్యాజ్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంజయ్ దత్ విడుదలపై ప్రజాహిత వ్యాజ్యం

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విడుదల కోసం అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఇలా ఎంతో మంది నిరీక్షిస్తున్న సమయంలో... ఆయన విడుదలను సవాలు చేస్తూ ఓ వ్యక్తి బోంబే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాడు. ప్రదీప్ బాలేకర్ పేరుతో దాఖలైన ఈ వ్యాజ్యంపై కోర్టు గురువారం విచారణ జరపనుంది. సంజయ్ దత్ కూడా గురువారమే విడుదల కానున్న సంగతి తెలిసిందే. సంజయ దత్ విడుదల విషయమై తాను గతంలో కూడా బోంబే హైకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని పిటిషనర్ ప్రస్తావించారు. మున్నాబాయి జైలు శిక్షా కాలాన్ని బాలేకర్ తన వ్యాజ్యంలో ప్రశ్నించారు. సంజయ్ దత్ కు జైలులో అధికారులు ఎన్నో వసతులు సమకూర్చారని, సాధారణ ఖైదీలకు ఈ సదుపాయాలు లేవన్నారు. కాగా, ఈ పిటిషన్ సంజయ్ విడుదలకు ఆటంకం కాబోదని తెలుస్తోంది.

More Telugu News