వరుసగా ఆరవ ప్రపంచకప్ లో త్రిమూర్తులు!
టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమై 8 సంవత్సరాలు గడచిపోగా, తొలి మ్యాచ్ లో ఆడిన భారత ఆటగాళ్లలో ముగ్గురు ఈ సంవత్సరం జరిగే పోటీల్లో బరిలోకి దిగనున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మొత్తం 19 మంది ఇప్పటివరకూ జరిగిన ఐదు వరల్డ్ కప్ టీ-20 పోటీల్లో ఆడి, ఇప్పుడు ఆరవ టోర్నీకి సిద్ధమయ్యారు. 2007లో తొలి మ్యాచ్ జరుగగా, అప్పుడు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ వచ్చే నెల నుంచి ఇండియాలో జరిగే పోటీల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అల్ హసన్, మెర్తజా, మహ్మదుల్లా, రహీంలు, వెస్టిండీస్ కు చెందిన డ్వేన్ బ్రావో, క్రిస్ గేల్, రామ్ దిన్, న్యూజిలాండ్ కు చెందిన రాస్ టేలర్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డివిలియర్స్, డుమిని, శ్రీలంకకు చెందిన దిల్షాన్, మలింగ, పాకిస్థాన్ ఆటగాడు అఫ్రిది, ఆస్ట్రేలియాకు చెందిన వాట్సన్ లు ఉన్నారు.