వాస్తు దోషాల కారణంగానే అద్దె ఇంటిని ఖాళీ చేస్తున్న చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాస్తు దోషాల కారణంగానే అద్దె ఇంటిని ఖాళీ చేస్తున్న చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హైదరాబాదులోని తన సొంతింటిని కూల్చేసి భారీ భవంతిని కట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంటి రీ మోడలింగ్ నేపథ్యంలో సొంతింటిని ఖాళీ చేసిన చంద్రబాబు కుటుంబం ఆ ఇంటికి సమీపంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెం:22లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దానిలోకి మారిపోయింది. తాజాగా సదరు అద్దె ఇంటిని కూడా ఆయన ఖాళీ చేయనున్నట్లు నిన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలు నిజమేనని తాజాగా తేలింది. అద్దె ఇంటిలో వాస్తు దోషాలపై వాస్తు పండితులు హెచ్చరించిన కారణంగానే చంద్రబాబు దానిని ఉన్నపళంగా ఖాళీ చేస్తున్నారని సమాచారం. సొంతింటి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో హైదరాబాదు శివారు ప్రాంతం రంగారెడ్ది జిల్లా మదీనగూడలోని ఫాంహౌజ్ కు చంద్రబాబు కుటుంబం మారనుంది. ప్రస్తుతం అద్దె ఇంటిలోని సామన్లను ఫాంహౌస్ కు తరలించే పనిలో చంద్రబాబు కుటుంబం బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఈ పని పూర్తికాగానే చంద్రబాబు కుటుంబం ఫాం హౌస్ కు మారనుంది. సొంతింటి నిర్మాణం పూర్తయ్యేదాకా చంద్రబాబు కుటుంబం అక్కడే ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

More Telugu News