'బ్రహ్మోత్సవం'లో మహేశ్ బాబు కుమార్తె సితార?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార 'బ్రహ్మోత్సవం' సినిమాతో వెండితెరపై తళుక్కుమననుందని వార్తలు వెలువడుతున్నాయి. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ 'వన్ నేనొక్కడినే' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కుమార్తెను కూడా పరిచయం చేస్తున్నాడు. ఈ వార్తతో మహేశ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తండ్రీకూతుళ్లను ఒకేసారి స్క్రీన్ పై చూసేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ 'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేశ్ బాబు సరసన కాజల్, సమంతా, ప్రణీత కథానాయికలుగా నటిస్తుండగా, పొట్లూరి వి.ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.